పోలీసులతో వాగ్వాదానికి దిగిన అఖిలప్రియ

Update: 2019-09-11 03:35 GMT

మాజీ మంత్రి, ఆళ్లగడ్డ టీడీపీ ఇంచార్జ్ భూమా అఖిలప్రియను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన అఖిల ప్రియను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులతో అఖిలప్రియ వాగ్వాదానికి దిగింది. మరోవైపు ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చిన 'ఛలో ఆత్మకూరు' కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. 

Tags:    

Similar News