మీ సత్వర స్పందనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా..ప్రధానికి బాబు లేఖ

విశాఖ గ్యాస్‌లీక్‌ దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు కోరుతూ టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు.

Update: 2020-05-09 02:56 GMT
Chandrababu Naidu(File photo)

విశాఖ గ్యాస్‌లీక్‌ దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు కోరుతూ టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దుర్ఘటనపై మీ సత్వర స్పందనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సత్వరమే మీరు స్పందించి చేపట్టిన చర్యలు విశ్వాసాన్నిచ్చాయి. గ్యాస్‌ లీకేజీపై విచారణ కమిటీని ఏర్పాటు చేయాలి. విషవాయువు విడుదలకు దారితీసిన అంశాలపై ఆధారపడి చేయించాలి. లీకైన వాయువు స్టైరీన్‌ అని కంపెనీ చెబుతోంది. స్టైరీన్‌తో పాటు మరికొన్ని వాయువులు ఉన్నాయని భిన్న నివేదికలు ఉన్నాయి అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

విశాఖపట్నం ఎల్‌జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీక్ ప్రమాదంలో మృతుల సంఖ్య 12కు చేరింది. ఈ మేరకు పోలీసులు గురువారం రాత్రి అధికారికంగా మృతుల వివరాలను ప్రకటించారు. మృతుల్లో ఓ వైద్య విద్యార్థి, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కేజీహెచ్ ఆస్పత్రిలో మూడు వార్డుల్లో 193 మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్నవారిలో 47 మంది చిన్నారులు ఉన్నారు. 

Tags:    

Similar News