సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి టీడీపీ, జనసేన నేతలు

AP News: వైసీపీలో చేరిన పోతిన మహేష్, రాజేశ్వరిదేవీ, రమేష్‌కుమార్‌రెడ్డి,

Update: 2024-04-10 06:05 GMT

సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి టీడీపీ, జనసేన నేతలు

AP News: ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు పార్టీల కూటమిలో భాగంగా సీట్ల దక్కని నేతలు ఎన్నికల సమయంలో వైసీపీ వైపు చూస్తున్నారు. అందులో భాగంగా విజయవాడ పశ్చిమం నుంచి సీటు ఆశించి భంగపడిన జనసేన నేత పోతిన మహేష్ తాజాగా సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. విజయవాడ నుంచి ర్యాలీగా పల్నాడులో జగన్ బస చేసిన సైట్ వద్దకు వచ్చిన పోతిన వైసీపీ కండువా కప్పుకున్నారు.

పోతిన మహేష్‌తో పాటు రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, పోతిన మహేష్‌ వైసీపీలో చేరారు. వీరి ముగ్గురికి పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు సీఎం జగన్‌.

Tags:    

Similar News