శ్రీవారి లడ్డూల అమ్మకం ప్రారంభం.. పోటెత్తిన భక్తులు

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ)భక్తులకు శ్రీవారి దర్శనాలు నిలిపివేసిన విషయం తెలిసిందే.

Update: 2020-05-16 07:30 GMT
Srivari Laddu Prasadam (File Photo)

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ)భక్తులకు శ్రీవారి దర్శనాలు నిలిపివేసిన విషయం తెలిసిందే. లడ్డూ ప్రసాదం విక్రయాలు నిలిపివేసింది. స్వామి వారి నిత్య కైంకర్యాలను మాత్రం అర్చకులు నిర్వహిస్తున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థాన శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ రోజు ఉదయం నుంచి మళ్లీ ప్రారంభమయ్యాయి. ప్రధాన పరిపాలన భవనం వద్ద వీటిని అమ్ముతున్నారు. లాక్‌డౌన్‌ వల్ల 55 రోజుల పాటు విక్రయాలు నిలిచిపోయిన శ్రీవారి లడ్డూలను మళ్లీ భక్తులు పొందే అవకాశం లభించింది.

లడ్డూ విక్రయాలు ప్రారంభమయ్యాయని తెలుసుకున్న భక్తులు ఇవాళ కాలమేవాటి కోసం భారీగా తరలిరావడం గమనార్హం. లాక్ డౌన్ తర్వాత భౌతిక దూరం నిబంధనలను పాటిస్తూ పరిమిత సంఖ్యలో త్వరలో భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు.


Tags:    

Similar News