విశాఖ పోలీసుల అదుపులో సస్పెండెడ్‌ డాక్టర్ సుధాకర్

విశాఖ జిల్లా నర్సీపట్నం ఆసుపత్రిలో మాస్కులు లేవంటూ హల్చల్ చేసి సస్పెన్షన్ కు గురైన డాక్టర్ సుధాకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Update: 2020-05-16 14:38 GMT

విశాఖ జిల్లా నర్సీపట్నం ఆసుపత్రిలో మాస్కులు లేవంటూ హల్చల్ చేసి సస్పెన్షన్ కు గురైన డాక్టర్ సుధాకర్ మరోసారి వార్తలకెక్కారు. మద్యం తాగి అక్కయ్య పాలెం పోర్ట్ హాస్పిటల్ జంక్షన్ వద్ద హల్ చల్ చేస్తుండటంతో నాలుగో పట్టణ పోలీసులు అదుపులోకి తీసు కున్నారు. విశాఖ పోలీస్ కమిషనర్   ఆర్.కె.మీనా తెలిపిన వివరాలు ఇలావున్నాయి.

"విశాఖ నగరం అక్కాయపాలెం హైవే రోడ్డు పై ఒక వ్యక్తి గందరగోళం చేస్తున్నట్లు గా డయల్ 100 కి ఫిర్యాదు వచ్చింది

తక్షణమే నాల్గోవ పట్టణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు అడగ్గా వ్యక్తి నర్సీపట్నం ఆసుపత్రి లో సస్పెండ్ అయ్యిన డాక్టర్ సుధాకర్ గా గుర్తింపు

పోలీసులు డాక్టర్ ని వారించే ప్రయత్నం చేయగా సదురు ట్రాఫిక్ కానిస్టేబుల్ పై దురుసుగా ప్రవర్తించి, సెల్ ఫోన్ లు లాక్కుని విసిరారు

ప్రధాన జాతీయ రహదారి కావటం తో వాహనాలు , ప్రజలు కు తీవ్ర ఇబ్బందులు గురువతారు అని డాక్టర్ సుధాకర్ ని అదుపులోకి తీసుకుని పోలీసులు 4 th పోలీస్ స్టేషన్ కు తరలించారు

డాక్టర్ మద్యం సేవించి ఉండడం తో అతన్ని ఆల్కహాల్ పరీక్షలు నిమిత్తం కింగ్ జార్జి ఆసుపత్రికి తరలించం

డాక్టర్ పై లాఠీ తో కొట్టారు అని ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ని సస్పెండ్ చేసాము

ఆల్కహాల్ పరీక్షలు అనంతరం అతని పై 353 సెక్షన్ పెట్టి కేసు నమోదు చేస్తాము ,పరిస్థితి ని బట్టి చర్యలు ఉంటాయి

గత కొంత కాలంగా డాక్టర్ సుధాకర్ మానిసిక గా ఇబ్బందులు పడుతున్నారు


Tags:    

Similar News