రేషన్ కార్డు లేని వారు వాలంటీర్లకు వివరాలు అందజేయాలి

నందివాడ మండల పరిధిలోని పలు గ్రామాలకు రేషన్ కార్డు లేని వాళ్ళు వాలంటీర్లను కలిసి వివరాలు అందజేయాలని తహసిల్దార్ సూచించారు.

Update: 2019-11-22 08:55 GMT
Representational Image

గుడివాడ: నందివాడ మండల పరిధిలోని పలు గ్రామాలకు రేషన్ కార్డు లేని వాళ్ళు వాలంటీర్లను కలిసి వివరాలు అందజేయాలని తహసిల్దార్ అబ్దుల్ రెహమాన్ సూచించారు. ప్రస్తుతం వైయస్సార్ నవశకం పథకం కింద సర్వే జరుగుతుందని, ఇందులో భాగంగా, బియ్యం కార్డు తో పాటు పింఛన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, విద్య దీవెన, వసతి దీవెన కార్డులను ప్రభుత్వం మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అర్హతలను బట్టి ఆయా కార్డులు పొందాలనుకునేవారు వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.




Tags:    

Similar News