Visakhapatnam: రుసుములు తగ్గించాలని విద్యార్థుల ఆందోళన

జిల్లా కేంద్రంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అపరాథ రుసుములు తగ్గించాలని విద్యార్థులు ఆందోళన బాట పట్టారు.

Update: 2020-02-01 10:11 GMT

విశాఖపట్నం: జిల్లా కేంద్రంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అపరాథ రుసుములు తగ్గించాలని విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. పెంచిన ఫీజులు తగ్గించాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా అధికారులు స్పందించలేదని విద్యార్థులు వాపోయారు. ఎలాంటి నోటీసులు లేకుండా సెమిస్టర్​కు రూ.400 అపరాధ రుసుము పెంచటాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.

అనంతరం ఉపకులపతి, రిజిస్ట్రార్ కార్యాలయాలు ముట్టడించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను నిలువరించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఫీజులు తగ్గించేవరకూ తమ ఆందోళన కొనసాగుతుందని వీసీ కార్యాలయం ఎదుట విద్యార్థులు బైఠాయించారు.


Tags:    

Similar News