Kurnool: చిన్న గొడవ.. పెద్ద యుద్ధం కోడుమూరులో ఇరువర్గాల ఘర్షణ!
Kurnool: కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తిలో మురుగునీటి విషయంలో ఇరువర్గాలు గడ్డపారలు, కర్రలతో దాడులు చేసుకున్నాయి.
Kurnool: చిన్న గొడవ.. పెద్ద యుద్ధం కోడుమూరులో ఇరువర్గాల ఘర్షణ!
Kurnool: కర్నూలు జిల్లా కోడుమూరు (మ) ప్యాలకుర్తిలో ఇరువర్గాల మద్య ఘర్షణ చెలరేగింది. ఇంటి ముందు మురుగునీరు పారే విషయంలో చెలరేగిన వాగ్వాదం.. ఘర్షణగా మారింది. గడ్డపార, కర్రలతో ఇరువర్గాలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఘర్షణలో ఒక వర్గానికి చెందిన తిమ్మన్న, రంగన్న, రవి, సురేష్ ల తలలు పగిలి గాయాలు కాగా తిమ్మన్న కు తీవ్ర గాయాలయ్యాయి. టిడిపికి చెందిన నాయకులు మద్దతుతోనే తమపై దాడులు జరిపారని బాధితులు ఆరోపించారు. సీన్ ఆఫ్ అఫెన్స్ పరిశీలించిన పోలీసులు.. చికిత్స నిమిత్తం బాధితులను కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.