Srikakulam: దమ్ముంటే చర్చకు రండి.. వైసీపీ నేతలకు బాగాది శేషు ఓపెన్ ఛాలెంజ్!
Srikakulam: ప్రజలను తప్పుదోవ పట్టించడానికే వైసీపీ 'పోర్టుకు పోదాం రండి' సభ నిర్వహిస్తోందని ఏఎంసీ చైర్మన్ బాగాది శేషు విమర్శించారు.
Srikakulam: దమ్ముంటే చర్చకు రండి.. వైసీపీ నేతలకు బాగాది శేషు ఓపెన్ ఛాలెంజ్!
Srikakulam: ప్రజలనీ తప్పుదోవ పట్టించడానికి పోర్టుకు పోదాం రండి సభ- AMC చైర్మన్ బాగాది శేషు, ప్రజలనీ తప్పుదోవ పట్టించడానికి పోర్టుకు పోదాం రండి సభ రాళ్లు తరలించినంత మాత్రాన పోర్టు పూర్తవ్వదు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం పోర్టును వాడుకుంటున్నారూ
కేవలం 20% మాత్రమే పోర్టు పనులు చేసి మేమే చేశాము అని చెప్పుకోవడం హాస్యాస్పదం.
ప్రజలనీ తప్పుదోవ పట్టించడానికి Y.S.R.C.P నాయకులు పోర్టుకు పోదాం రండి సభ నిర్వహించారని A.M.C చైర్మన్ బాగాది శేషు తెలిపారు.
ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలోనే పోర్టు అన్ననుమతులు పూర్తి చేసిందని కేవలం 2019 లో తెలుగుదేశం అధికారంలోకి రాకపోవడం వల్లే మద్యలో పోర్టు శంకుస్థాపన చేయలేకపోయామని పేర్కొన్నారు, తర్వాత వచ్చిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం భావనపాడు పోర్ట్ ను మూలపేటగా నామకరణం చేసి, కేవలం 20% మాత్రమే పోర్టు పనులు చేసినంత మాత్రాన పోర్టు పనులు మేమే చేసాం అని చెప్పుకోవడం హాస్యాస్పదం అని తెలిపారు, రాళ్లు తరలించినంత మాత్రాన పోర్టు పూర్తవ్వదు అని హేళన చేశారు, ఎస్ఆర్సిపి ప్రభుత్వం కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం పోర్టును వాడుకుంటు, ప్రజలను మభ్య పెడుతున్నారని తెలిపారు, పోర్టు పేరుతో అక్రమ భూసేకరణ, చేసి బన్నువాడ, మోదుగవలస రైతుల నీటి కలవర్టును సైతం ధ్వంసం చేశారు, కనీసం పోర్టు కోసం రహదారులు నిర్మించాలని కనీస ఆలోచన లేకుండా ఉన్న రోడ్లన్నీ ధ్వంసం చేశారని పేర్కొన్నారు, కోటబొమ్మాలి సంతబొమ్మాలి రహదారులు, పంట కల్వర్టులు అన్ని ధ్వంసం చేసి, రాళ్లు తరలించారు, అచ్చ నాయుడు గారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వయంగా గ్రామాల సందర్శించి రైతులకు కావలసిన రోడ్లు మరియు బాక్స్ కల్వర్టులు, రహదారులు రైతుల కోసం పోర్ట్ యాజమాన్యంతో మాట్లాడి నీటి కాలువలు, రైతులకు కావలసిన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేశారు.
మరల టెక్కలి నియోజక ప్రజలు ఎప్పుడు మంచి నీటికి ఇబ్బంది పడకూడదని అచ్చెన్నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి ఒప్పించి 614 కోట్లు శాంక్షన్ చేయించిన ఘనత కేవలం కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు, ఆప్సోర్ రిజర్వాయర్ కు ఆ రోజుల్లో 600 కోట్లు నిధులు మేమిచ్చాం. మళ్లీ ఆఫ్షోర్ ప్రాజెక్ట్ పనులు పరుగులు పెట్టిస్తుంది కూటమి ప్రభుత్వమే అని గుర్తు చేశారు, చరిత్ర ఎప్పుడూ ప్రజలకి మంచి చేసిన నాయకులను గుర్తు పెట్టుకుంటుంది, ఆనాడు కూడా ఉద్దానం మంచినీటి పథకాన్ని స్వర్గీయ శ్రీ కింజరాపు ఎర్రన్నాయుడు ప్రారంభిస్తే ప్రజలను ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారు.
YCP నాయకులు కేవలం కక్ష రాజకీయాలకు మాత్రమే పరిమితం, వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హాయంలో తెలుగుదేశం నాయకులు ప్రజల ఉద్దేశించి ఎటువంటి సమావేశం ఏర్పాటు చేసిన సమావేశం ముందు రోజు రాత్రి గృహనిర్బంధాలు చేయడం వారి కక్ష రాజకీయాలకి నిదర్శనమన్నారు, అదే తీరును కూటమి ప్రభుత్వం చేసి ఉంటే ఈ "పోర్టుకు పోదాం రండి" సభ సజావుగా జరిగేనా ఆయన ప్రశ్నించారు, మంత్రి అచ్చెన్నాయుడు మౌనంగా ఉన్నారని అవాకులు చవాకులు ఆయన మీద మాట్లాడితే ఊరుకునేది లేదు అని సమాధానం ఇచ్చారు, దమ్ముంటే 2019 నుంచి 2024 మధ్య మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో చెప్పండి.
వంశధార ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి అంటే అది కింజరాపు డెడికేషన్ మాత్రమే, రామ్మోహన్ నాయుడుగారు కోసం మాట్లాడే అర్హత శ్రీకాకుళం లోని గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని ఏ వైసీపీ నాయకుడికి లేదు ఆయన కేంద్ర మంత్రిగా ప్రోటోకాల్ పరంగా తొమ్మిదవ స్థానంలో ఉన్నారు ఆయనకు విమర్శించే ముందు అది మీరు ముందుగా తెలుసుకోండి. ఆయన చొరవతోనే 385 ఎకరాల సాల్ట్ ల్యాండ్ 99 సంవత్సరాలకు లీజుకు తీసుకురావడం వలన ఈరోజు పోర్టు రహదారి వేగవంతానికి సహకారం అయింది.
ముఖ్యంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో పోర్టుకు కొబ్బరికాయ కొట్టిన తర్వాత మీరు ఎంత శాతం పనులు చేశారు మేం అధికారంలోకి వచ్చాక మేము ఎంత శాతం పనులు చేసామో టెక్కిలి నియోజకవర్గంలో ఎక్కడైనా మేము చర్చికి సిద్ధమే అంటూ సవాల్ విసిరారు.