Koyyalgudem: ఎన్నికల్లో మద్యం డబ్బులు పంపిణీ చేస్తే కఠిన చర్యలు

స్థానిక సంస్థల ఎన్నికల ముసుగులో మద్యం, డబ్బు పంపిణీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై జయబాబు అన్నారు.

Update: 2020-03-09 12:34 GMT

కొయ్యలగూడెం : స్థానిక సంస్థల ఎన్నికల ముసుగులో మద్యం, డబ్బు పంపిణీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై జయబాబు అన్నారు. మండలంలోని గవరవరం లో పేకాట కోడిపందాలపై దాడులు నిర్వహించి 6 గురు వక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 6200 నగదు 4 కోడి పుంజులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయడానికి ఎవరైనా డబ్బులు, మద్యం, ఏవైనా వస్తువులు, బహుమతులు పంచుతూ పోలీసులకు పట్టుబడితే మూడేళ్ల జైలు శిక్షతో పాటు ఎన్నికైన పదవులకు అనర్హులుగా ప్రకటించబడతారని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా లో పేకాట కోడిపందాల తో పాటు బెట్టింగ్స్ నిర్వహించిన చట్టరీత్యా వారి పై చర్యలు తప్పవన్నారు


Tags:    

Similar News