Nellore: ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికపై కుక్కల దాడి
Nellore: బాలికను ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
Nellore: ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికపై కుక్కల దాడి
Nellore: ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. 14 వార్డులో పుల్లయ్యబడి వద్ద ఏడేళ్ల చిన్నారి హాసినిపై మూకుమ్మడిగా దాడి చేశాయి. గమనించి పెద్దగా కేకలు వేయడంతో కుక్కలు వెళ్లిపోయాయి. తీవ్రంగా గాయపడిన పాప హాసినిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఆసుపత్రిలో బాలిక కోలుకుంటోంది.
వెంకటగిరిలో వీధి కుక్కల దాడిపై స్థానికుల్లో తీవ్ర అగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. పట్టణం పరిధిలో వీధి కుక్కలు అనేక మందిపై దాడులు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురిపై వీధి కుక్కలు దాడి చేశాయంటున్నారు. కుక్కలు కరిచినా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని బాలిక కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.