శ్రీశైలం ఇన్‌చార్జి ఎస్‌ఈ తొలగింపు
శ్రీశైలం ఇన్‌చార్జి ఎస్‌ఈ తొలగింపు శ్రీశైలం ఇన్‌చార్జి ఎస్‌ఈ తొలగింపు శ్రీశైలం ఇన్‌చార్జి ఎస్‌ఈ తొలగింపు
శ్రీశైలం డ్యాం ఇన్‌చార్జి సూపరిండెంట్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డిని తొలగిస్తూ జలవనరులశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో నీరు-ప్రగతి విభాగం ఎస్‌ఈగా పనిచేస్తున్న ఎస్.చంద్రశేఖర్రావుకు అదనపు బాధ్యతలు ఇచ్చింది. శ్రీశైలం డ్యాం గేట్లను ఎస్‌ఈ శ్రీనివాసరెడ్డి తన సతీమణితో ఓపెన్ చేయించారు. దాంతో ఆయన విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఎస్‌ఈపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.