స్పీకర్‌ స్థానానికి గౌరవం ఇవ్వరా..? : స్పీకర్‌

Update: 2019-12-11 05:25 GMT
తమ్మినేని

అసెంబ్లీలో స్పీకర్ స్థానానికి కూడా గౌరవం ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీ ఉందని, ఆ పార్టీ నాయకుడే నోరు జారితే, ఎమ్మెల్యేలు ఎలా సంయమనంతో ఉంటారని స్పీకర్ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంగ్లీష్ మీడియం విషయమై చర్చ జరుగుతున్న సందర్భంగా, ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించుకుందామని సీఎం జగన్, ఆర్థికమంత్రి బుగ్గన సూచించారు. ఈ చర్చ వ్యక్తిగత విమర్శల వైపు వెళ్లడంతో, చెవిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో గందరగోళానికి దారి తీశాయి. తనకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు కోరగా, ఆంగ్ల మాధ్యమంపై రేపు చర్చిద్దామని, నేడు ప్రవేశపెట్టాల్సిన బిల్లులు చాలా ఉన్నాయని స్పీకర్ అన్నారు.

Tags:    

Similar News