దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు ఇవే..

Update: 2019-09-21 05:43 GMT

దసరా, దీపావళి పండుగల సందర్బంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వే పలు ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ క్రమంలో కాచిగూడ–శ్రీకాకుళం (07148/07147) రైలు అక్టోబర్‌ 6, 13, 20, 27 తేదీల్లో సాయంత్రం 6.45కి బయలుదేరి మరుసటి ఉదయం 8.55కి శ్రీకాకుళం చేరుకుంటుంది. తిరిగి అక్టోబర్‌ 7, 14, 21, 28 తేదీల్లో సాయంత్రం 5.15కి బయలుదేరి మరుసటి ఉదయం 6.30కి కాచిగూడ చేరుకుంటుంది. కాకినాడ టౌన్‌, కర్నూలు మధ్య అక్టోబర్‌ 1 నుంచి వారానికి రెండు రోజులపాటు 54 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.

ఈ రైళ్లు కాకినాడలో రాత్రి 6.50కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.10కి కర్నూలు చేరుకుంటాయి. తిరిగి కర్నూలు నుంచి సాయంత్రం 4 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30కి కాకినాడ చేరుకుంటాయి. కాకినాడ-రాయచూర్‌ మధ్య అక్టోబర్‌ 2 నుంచి వారానికి మూడు రోజులుపాటు 78 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ రైళ్లు కాకినాడ టౌన్‌లో మధ్యాహ్నం 2.25కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30కి రాయచూర్‌ చేరుకుంటాయి. తిరిగి రాయచూర్‌ నుంచి మధ్యాహ్నం 2.05కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30కి కాకినాడ టౌన్‌కు చేరుకుంటాయి. 

Tags:    

Similar News