somu veerraju as BJP: ఇది కార్యకర్తకు దక్కిన అవకాశం : సోము వీర్రాజు

Update: 2020-07-28 06:38 GMT

somu veerraju as BJP state president: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజును ఎంపిక చేసింది హైకమాండ్ . ప్రస్తుతం చీఫ్ కన్నా లక్ష్మీనారాయణను ఆ పదవి నుంచి తప్పించి ఆయన స్థానంలో సోమువీర్రాజును రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధికారికంగా ప్రకటనను విడుదల చేశారు. తూర్పుగోదావరి జిల్లా కత్తేరు గ్రామానికి చెందిన సోమువీర్రాజు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు.

Hmtvతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడారు. సోము వీర్రాజు వ్యాఖ్యలు యధావిధిగా..ఇది కార్యకర్తకు దక్కిన అవకాశం. ఏపీలో బిజేపీని బలోపేతం చేస్తాను. జనసేనతో కలిసి పార్టీ పటిష్టతకు కార్యాచరణ సిద్ధం చేసుకుని ముందుకు వెళతాం. కన్నా తో పాటు బిజేపీ సీనియర్ నేతలను కలుపుకుని ముందుకు వెళతాను. ఇసుక, ఇళ్ళ పట్టాల భూములు అవినీతి, చంద్రబాబు హయాంలో అవినీతిపై పోరాటాలు చేస్తూనే వున్నాఁ. ఎవర్నీ నెత్తినేసుకుని మోయాల్సిన అవసరం బిజేపీ కి లేదు. సంక్షేమానికి మేం వ్యతిరేకం కాదు.. అయితే అప్పుడు చంద్రబాబు, ఇపుడు జగన్ పంపకాలుపైనే దృష్టి పెట్టారు. ఉపాధి అవకాశాలు కల్పించకుండా, పరిశ్రమలు స్థాపన లేకుండా ప్రభుత్వం పనిచేయడం సరికాదు..కేవలం డబ్బులతో సంక్షేమం అనుకోవడం పొరపాటే. ఉపాధిలో ఇళ్ళ నిర్మాణాలకు 1.50 లక్షల సబ్సిడీ ఇస్తున్నాం. ఇళ్ళ నిర్మాణాలు చేపడితే ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. కోస్తాతీరంలో మత్స్య కారులకు ఉపాధి కల్పించడానికి ఫిషింగ్ హార్భర్ల నిర్మాణానికి నిధులు వున్నాయి. ఆరు జెట్టీలు మంజూరు చేశాం. వాటి గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాజధాని అమరావతి లోనే వుండాలి..ఇప్పటికైనా 13 జిల్లాల అభివృద్ధి జరగాలి.

హైదరాబాద్ లో ఉమ్మడి రాజధాని వుండటంతో ఏపీ నష్టపోయింది. ఇపుడు మూడు జిల్లాలకే అభివృద్ధి పరిమితం చేస్తామా. జనసేన నేత పవన్ కల్యాన్ కు బిజేపీ అత్యంత ప్రాధాన్యం ఇవ్వనుంది. వచ్చే ఎన్నికలలో జనసేన- బిజేపీ కలిసి వైసీపీని రాజకీయంగా నిర్మాణాత్మకంగా ఎదుర్కొంటుంది. సంక్షేమం జగన్ ప్రభుత్వమే కాదు.. అందులో కేంద్రప్రభుత్వ వాటా లేదా. చంద్రబాబు ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీయే కావాలన్నాడు. అర్ధరాత్రి మీడియాలో హడావుడిగా చెప్పేశారు. కేంద్రప్రభుత్వ పధకాలు , అమలులో చెప్పుకోవడంలో లోపం వుంది.. మీడియాలో కూడా చూపించడం లేదు. ప్రత్యేక హోదా విషయంలో దాటవేత, చాచివేత మా పార్టీలో లేదు చంద్రబాబు వద్దన్నాడో లేదో చెప్పమనండి. గతంలో చంద్రబాబు ను అధికారం లోకి తీసుకురావడాని కీలక పాత్ర పవన్ పోషించారు. అందులో డౌటేమీ లేదు. ఇపుడు జనసేనతో కలిసి గ్రామీణ స్థాయికి పార్టీని తీసుకువెళతాం. 14నెలల జగన్ పాలనపై మార్కులు వేయడానికి ఆయనేమైనా విద్యార్ధా. ప్రజా వ్యతిరేకమైన ప్రతి అంశం పైనా ఏపీలో పోరాడతాం. పార్టీకి కొత్త జవసత్వాలు తీసుకువస్తాం. కన్నాను తొలగించలేదు, అన్ని రాష్ట్రాలలో పార్టీ నిర్ణయాలకు కట్టుబడే మార్చారు. పారీటీ అధిష్ఠానం ఆయన సేవలను వినియోగించుకుంటుంది. కన్నా ది తొలగింపు అంటే నేను ఒప్పుకోను అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

Tags:    

Similar News