Somu Veerraju appointed as AP BJP chief: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు
Somu Veerraju appointed as AP BJP Chief: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజును ఎంపిక చేసింది హైకమాండ్ . ప్రస్తుతం చీఫ్ కన్నా లక్ష్మీనారాయణను ఆ పదవి నుంచి తప్పించి ఆయన
somu veerraju ( File photo)
Somu Veerraju appointed as AP BJP Chief: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజును ఎంపిక చేసింది హైకమాండ్ . ప్రస్తుతం చీఫ్ కన్నా లక్ష్మీనారాయణను ఆ పదవి నుంచి తప్పించి ఆయన స్థానంలో సోమువీర్రాజును రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధికారికంగా ప్రకటనను విడుదల చేశారు. తూర్పుగోదావరి జిల్లా కత్తేరు గ్రామానికి చెందిన సోమువీర్రాజు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు..
ఇక 2014 ఎన్నికల సమయంలో జనసేన పార్టీ, టీడీపీ పార్టీల మధ్య పొత్తలో అయన కీలక పాత్ర పోషించారు.తాజాగా చోటు చేసుకున్న పరిమాణాలతో ఇప్పటివరకూ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నాను తప్పించి సోము వీర్రాజును ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించినట్లు తెలుస్తోంది. ఇక అటు తెలంగాణలో ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపీ బండి సంజయ్ ని నియమించిన సంగతి తెలిసిందే...
Next Story




