ఊహించలేని సవాళ్లను ఎదుర్కొన్నాం : జేపీ నడ్డా

Arun Chilukuri
Published on: 30 May 2020 4:20 PM IST
ఊహించలేని సవాళ్లను ఎదుర్కొన్నాం : జేపీ నడ్డా
X

ప్రతిపక్షాలు 60 ఏళ్ల పాలనలో చేయలేని పనులను ప్రధానిగా మోదీ ఆరేళ్లలో సుసాధ్యం చేశారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. మోదీ రెండోసారి ప్రధాని పగ్గాలు చేపట్టి యేడాది పూర్తైన సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ఈ యేడాది ''సాఫల్యతల యేడాది'' అని ఆయన అభివర్ణించారు. ఊహించని పరిణామాలు సంభవించినా, వాటిని ప్రధాని మోదీ ధైర్యంతో ఎదుర్కొన్నారని ఆయన ప్రశంసించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దూరదృష్టితో పని చేస్తున్నట్లు చెప్పారు.

కరోనా వైరస్‌ సంక్షోభాన్ని బీజేపీ రాజకీయం చేయడం లేదు. కానీ కాంగ్రెస్‌ మాత్రం రాజకీయాలు చేస్తూ.. కేంద్రంపై ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు. వలస కార్మికులకు తమ పార్టీ కార్యకర్తలు సహాయం చేస్తున్నారని నడ్డా పేర్కొన్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజల్ని రక్షించడంలో మోదీ ముందుండి దేశాన్ని నడిపిస్తున్నారని నడ్డా వ్యాఖ్యానించారు. అనేక శక్తిమంతమైన దేశాలు సైతం మహమ్మారిని నియంత్రించలేకపోయాయని.. భారత్‌లో మాత్రం వ్యాప్తి అదుపులో ఉందని చెప్పుకొచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story