Kanna Lakshmi Narayana Daughter In Law Case: కన్నా కోడలు కేసులో కొత్తకోణం

Kanna Lakshmi Narayana Daughter In Law Case: ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ కోడలు సుహారిక కేసులు కొత్తకోణం బయటికి వచ్చింది.

Raj
By Raj
Published on: 24 July 2020 9:57 PM IST
Kanna Lakshmi Narayana Daughter In Law Case: కన్నా కోడలు కేసులో  కొత్తకోణం
X

Kanna Lakshmi Narayana Daughter In Law Case: ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ కోడలు సుహారిక కేసులు కొత్తకోణం బయటికి వచ్చింది. తన భార్య మృతిపట్ల ఆమె భర్త ఫణింద్ర పలు అనుమానాలను వ్యక్తం చేశారు. సుహారిక మృతిపట్ల సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్యకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని.. చనిపోయినరోజు డ్రగ్ పార్టీ జరిగిందని దుష్ప్రచారం చేశారని ఫణింద్ర ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకూ తమ తోడల్లుడికి ఆర్ధిక వివాదాలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించేందుకు సుహారికను పిలిచారని వెల్లడించారు. మొదట సీబీఐటీ వద్ద తాను చనిపోయిందని చెప్పారు.. ఆ తరువాత ఓ ఆసుపత్రికి అతి సమీపంలో ఉన్న బ్యాంబో హిల్స్ లో చనిపోయిందని చెప్పారు.

ఆమె చనిపోయిన రోజు డ్రగ్స్ పార్టీ జరిగినట్టు ప్రచారం చేశారు.. ఆరోజు ఏమి జరిగిందని తమ అత్తమామలను అడిగితే నీకు అనవసరమంటూ వారు సమాధానం ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీలో పాల్గొన్న నలుగురు కూడా తప్పించుకొని తిరుగుతున్నారని.. పోలీసులు కేసును విచారించి నిజానిజాలను బయటికి తీయాలని కోరారు ఫణింద్ర. కాగా గత నెల సుహారిక అనుమానాస్పద రీతిలో చనిపోయారు. హైదరాబాద్ మాదాపూర్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మీనాక్షి టవర్స్‌లో స్నేహితురాలి ఇంటికి వెళ్లి సుహారిక కుప్పకూలారు. ఆమెను హుటాహుటిన రాయదుర్గంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ఐతే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

Raj

Raj

Next Story