Sirisha Bandla: అలా స్పేస్ లోకి తెలుగు అమ్మాయి బండ్ల శిరీష టూర్

Sirisha Bandla: ఈ వ్యోమనౌకలో గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీషకూడా జర్నీ చేయనుంది.

Update: 2021-07-11 10:09 GMT

శిరీష బండ్ల (ఫైల్ ఇమేజ్)

Sirisha Bandla: విను‌వీ‌ధిలో తెలుగు కీర్తి పతాకం రెప‌రె‌ప‌లా‌డ‌బో‌తోంది. తెలుగు అమ్మాయి పద పద అంటూ స్పేస్‌ టూర్‌కి పయనమైంది. 'వ‌ర్జిన్‌ గెలా‌క్టిక్‌' అంత‌రిక్ష పరి‌శో‌ధన సంస్థ వీ‌ఎ‌స్‌‌ఎస్‌ యూని‌టీ-22' అనే మాన‌వ‌స‌హిత వ్యోమ‌నౌకను మరికాసేపట్లో న్యూ మెక్సికో నుంచి రోదసీలోకి పంపించనుంది. ఈ వ్యోమనౌకలో గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీషకూడా జర్నీ చేయనుంది.

వర్జిన్‌ గెలాక్టిక్‌ వ్యవస్థాపకుడు రిచర్డ్‌ బ్రాస్‌నన్‌, శిరీషతోపాటు మరో నలుగురు హ్యోమగాములు ఈ స్పేస్‌ క్రాఫ్ట్‌లో వెళ్లనున్నారు. భూమి నుంచి 15 వేల మీటర్ల ఎత్తుకు వీఎంఎస్‌ ఈవ్‌ ప్రత్యేక విమానం వెళ్లనుంది. అందులోనే వ్యోమనౌక వీఎస్‌ఎస్‌ యూనిటీ-22 ఉంటుంది.

ఏపీలోని గుంటూరు జిల్లాలో జన్మించిన బండ్ల శిరీష.. తల్లిదండ్రులతో హ్యూస్టన్‌లో స్థిరపడ్డారు. అక్కడే విద్యనభ్యసించి ఏరోనాటికల్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. కాగా, ఈ ప్రయాణంలో భాగస్వామ్యం కావడం తనకెంతో హ్యాపీగా ఉందని శిరీష ట్విటర్‌లో పోస్ట్ చేశారు. కల్పన చావ్లా, సునీత విలియమ్స్‌ తర్వాత రోదసిలోకి ప్రయాణించనున్న మూడో భారతీయ మహిళగా శిరీష చరిత్ర సృష్టించనున్నారు. 

Full View


Tags:    

Similar News