Simhachalam Temple: రేపు గిరి ప్రదక్షిణ రద్దు.. సింహాచలం దేవాలయంలో ఆదేశాలు

Simhachalam Temple: శ్రీ వరహా లక్ష్మి నరసింహాస్వామి ఆలయంలో గిరి ప్రదక్షిణ రద్దు చేస్తూ విశాఖ కమీషనర్ ఆర్ కే మీనా ఉత్తర్వులు జారీ చేశారు.

Update: 2020-07-03 04:15 GMT

Simhachalam Temple: శ్రీ వరహా లక్ష్మి నరసింహాస్వామి ఆలయంలో గిరి ప్రదక్షిణ రద్దు చేస్తూ విశాఖ కమీషనర్ ఆర్ కే మీనా ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్టు తెలియజేశారు. ఈ నెల 4న నిర్వహించే గిరి ప్రదక్షిణ రద్దు చే యడమే కాకుండా ఆషాడ పౌర్ణమి సందర్భంగా ఈ నెల 5న జరిగే నాల్గో విడత చందన సమర్పణ కార్యక్రమంను రద్దు చేసినట్టు దేవాలయ అధికారులు ప్రకటించారు. స్వామి వారి గిరి ప్రదక్షిణకు గాని, మొక్కులు చెల్లించుకొనుటకు గాని భక్తులకు అనుమతి లేని కారణంగా ఆలయానికి రావద్దని సూచించారు.

అలా కాకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వ్యక్తులపై డిశాస్టర్ మేనేజిమెంట్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని కమీషనర్ వెల్లడించారు. అయితే ఇప్పటికే పలు దేవాలయాల్లో ఆలయ సిబ్బందికి కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. ఇలాంటి ఆలయాల్లో ఇప్పటికే రద్దు చేయగా, సింహాచలంలో ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ఆలయ అధికారులు చెబుతున్నారు. ఈ రెండు రోజులు భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఈ చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ఈ రెండు రోజులు ఆలయానికి ఎవరు వచ్చినా పోలీసు అధికారులు కేసులు నమోదు చేస్తారని వారు భక్తులను హెచ్చరించారు. 


Tags:    

Similar News