Indrakeeladri: 2వ రోజు శ్రీ గాయత్రిదేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మ
Indrakeeladri: తెల్లవారుజామునుంచే శ్రీ గాయత్రీదేవి దర్శనార్ధం బారులు తీరిన భక్తులు
Indrakeeladri: 2వ రోజు శ్రీ గాయత్రిదేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మ
Indrakeeladri: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. రెండో రోజు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. గాయత్రీ దేవిని దర్శించుకుంటే సకల మంత్ర సిద్ధి ఫలం పొందుతారని భక్తుల విశ్వాసం. నిన్న 80 వేల మందికి పైగా శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను భక్తులు దర్శించుకున్నారు. ఇవాళ శ్రీ గాయత్రీ దేవి దర్శనార్ధం మరింత మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.