పదిసూత్రాల అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష

స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు, పదిసూత్రాల అమలుపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు.

Update: 2025-12-24 08:55 GMT

అమరావతి: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు, పదిసూత్రాల అమలుపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎస్ కె.విజయానంద్, జలవనరులు, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఆర్థిక, వైద్యారోగ్య, రవాణా, పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన, పురపాలక, ఐటీ తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు అనే విధానంలో వేగంగా పౌరులకు మెరుగైన పాలన అందించేలా కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సుస్థిరాభివృద్ధితో పాటు స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించేందుకు కావాల్సిన, నిర్దేశించుకోవాల్సిన అంశాలపై సమావేశంలో చర్చించారు.

ప్రభుత్వ శాఖల మధ్య మెరుగైన సమన్వయం, తక్కువ వ్యయంతో ఇంధనం, విద్యుత్, రవాణా, నీటి భద్రత అందించటం లక్ష్యంగా ప్రణాళికల రూపకల్పన జరగాలని సీఎం అన్నారు. జీరో పావర్టీ, మానవ వనరుల అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, సాంకేతికత మేళవింపు తదితర అంశాల ఆధారంగా లక్ష్యాలు నిర్దేశం చేశారు. 

Tags:    

Similar News