Cyclone Montha: తీరం దాటిన మొంథా తుపాను

Cyclone Montha: తీవ్ర తుపాను ‘మొంథా’ మంగళవారం రాత్రి మచిలీపట్నం–కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో తీరం దాటింది.

Update: 2025-10-29 05:54 GMT

Cyclone Montha: తీరం దాటిన మొంథా తుపాను

Cyclone Montha: తీవ్ర తుపాను ‘మొంథా’ మంగళవారం రాత్రి మచిలీపట్నం–కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో తీరం దాటింది. రాత్రి 11.30 గంటల నుంచి 12.30 గంటల మధ్య తుపాను భూభాగాన్ని తాకిందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం తుపాను బలహీనపడుతూ రానున్న ఆరు గంటల్లో సాధారణ తుపానుగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది.

తుపాను ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరప్రాంతాల్లో గాలులు గంటకు 60–80 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Tags:    

Similar News