వాగు దాటుతుండగా ఒక్కసారిగా వచ్చిన వరద ప్రవాహం.. స్కూల్ టీచర్..

వాగు దాటుతుండగా ఒక్కసారిగా వచ్చిన వరద ప్రవాహం.. స్కూల్ టీచర్.. వాగు దాటుతుండగా ఒక్కసారిగా వచ్చిన వరద ప్రవాహం.. స్కూల్ టీచర్..

Update: 2019-09-17 12:44 GMT

తూర్పుగోదావరి జిల్లాలో ఓ వాగులో కొట్టుకుపోతున్న ఉపాధ్యాయురాలిని చాకచక్యంగా కాపాడారు గ్రామస్థులు. కూనవరం మండలం బోదునూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విధులు ముగించుకుని మధ్యాహ్నాం ఇంటికి తిరిగి వెళ్లేందుకు వాగు దాటుతుండగా.. ఒక్కసారిగా వరద ప్రవాహం ముంచుకొచ్చింది. దీంతో ఆమె వరద ఉధృతికి కొట్టుకుపోయింది. కాపాడంటూ కేకలు వేయడంతో గమనించిన గ్రామస్తులు.. ఆమెను ప్రాణాలకు తెగించి కాపాడారు. సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన స్థానికులు.. అనంతరం ఆమెను కూనవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News