మూడు లాంతర్ల స్థంభం తొలగింపుపై సంచయిత గజపతిరాజు స్పందన

విజయనగరంలో చారిత్రక మూడు లాంతర్ల స్థంభం తొలగింపుపై సింహాచలం ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ సంచయిత గజపతిరాజు స్పందించారు.

Update: 2020-05-23 14:35 GMT
Sanchaita Gajapathi Raju(File photo)

విజయనగరంలో చారిత్రక మూడు లాంతర్ల స్థంభం తొలగింపుపై సింహాచలం ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ సంచయిత గజపతిరాజు స్పందించారు.. ఈ మేరకు ఆమె తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.. అందులో.. 'విజయనగరంలో మూడు లాంతర్ల స్తంభంపై చంద్రబాబుగారు, మా బాబాయ్‌ అశోక్‌గజతి గారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజం ఏంటంటే.. ప్రస్తుతం అక్కడ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. అవి పూర్తయ్యాక మూడు లాంతర్ల స్తంభాన్ని తిరిగి ప్రతిష్టిస్తారు.' అని ఆమె వివరణ ఇచ్చారు. కాగా శుక్రవారం రాత్రి మూడు లాంతర్ల స్తంభాన్ని తొలగించారు.

అభివృద్ధి పనుల్లో భాగంగా తాము దాన్ని కూల్చివేసినట్టు అధికారులు వెల్లడించారు. మళ్లీ దాన్ని పునర్నిర్మిస్తామని కూడా స్పష్టం చేశారు.. అయితే దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.. విజయనగరంలో గజపతిరాజుల చరిత్రను కనుమరుగు చేయడంలో భాగంగానే మూడు లాంతర్ల స్థంభం కూల్చేశారంటూ విమర్శలు చేశారు. దీనికి మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాణ కూడా బదులిచ్చారు.. మూడు లాంతర్ల స్తూపం చారిత్రాత్మక స్తూపం కాదని.. మూడు లాంతర్ల అనేది సిమెంట్ కట్టడమన్నారు.. ప్రస్తుతం మూడు లాంతర్ల సెంటర్ లో పనులు జరుగుతున్నాయన్నా బొత్స.. మూడు లాంతర్ల సూప్తం స్థానంలో కొత్తది నిర్మాణం చేస్తున్నట్టు తెలిపారు.


Tags:    

Similar News