Sajjala Ramakrishna: చంద్రబాబు కుట్ర వల్లే ఈ కార్యక్రమానికి అడ్డంకి ఏర్పడింది
Sajjala Ramakrishna: చంద్రబాబు కుట్ర కారణంగానే పేదల ఇళ్ల పథకానికి అడ్డంకి ఏర్పడిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
Sajjala Ramakrishna: చంద్రబాబు కుట్ర వల్లే ఈ కార్యక్రమానికి అడ్డంకి ఏర్పడింది
Sajjala Ramakrishna: చంద్రబాబు కుట్ర కారణంగానే పేదల ఇళ్ల పథకానికి అడ్డంకి ఏర్పడిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. హైకోర్టు ఆదేశాలతో పేదల సొంతింటి కలసాకారానికి బ్రేక్ పడిందని చెప్పారు. కొన్ని రాజకీయ శక్తులు వికృత చర్యలకు పాల్పడుతున్నాయని, న్యాయస్థానాలను కూడా తమ స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. చివరికి న్యాయమే గెలుస్తుందన్న నమ్మకం మాకు ఉందంటూ చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్లు లేవని, పేదలకు ఆస్తి ఉండాలన్న లక్ష్యంతో ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు.