Sajjala: వచ్చే ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ అభ్యర్థిని మార్చాల్సిన పరిస్థితి వచ్చింది
Sajjala Ramakrishna Reddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు.
Sajjala: వచ్చే ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ అభ్యర్థిని మార్చాల్సిన పరిస్థితి వచ్చింది
Sajjala Ramakrishna Reddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. ఆధారాలు లేకుండా జగన్ పాలనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో జగన్‌పై నమ్మకంతోనే వైసీపీకి అఖండ మెజారిటీ ఇచ్చారన్న సజ్జల రెండున్నరేళ్లుగా ఏ ఎన్నిక జరిగినా రిజల్ట్ ఒకేలా వచ్చిందని గుర్తు చేశారు.
కుప్పంలో టీడీపీ అడ్రస్ లేకుండా పోయిందని, వచ్చే ఎన్నికల్లో ఆ స్థానంలో టీడీపీ తమ అభ్యర్థిని మార్చాల్సిన పరిస్థితి తలెత్తిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు శాపనార్ధాలతో ఏం ప్రయోజనం అని సజ్జల ప్రశ్నించారు. చంద్రబాబు తప్పులు చేయబట్టే జనం దండం పెట్టి ఆయన్ని పాలన నుంచి సాగనంపారని గుర్తు చేశారు. ప్రజలు నన్ను ఎందుకు నమ్మటం లేదని చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన హితవు పలికారు.