APSRTC MD Dwaraka Tirumal Rao: ప్రగతిపథంలో ఏపీఎస్ఆర్టీసీ

APSRTC MD Dwaraka Tirumal Rao: ఏప్రిల్-ఆగస్టు వరకు బస్సుల్లో 76 శాతం ఒఆర్ సాధించినట్టు తెలిపారు

Update: 2022-09-02 03:23 GMT

APSRTC MD Dwaraka Tirumal Rao: ప్రగతిపథంలో ఏపీఎస్ఆర్టీసీ 

APSRTC MD Dwaraka Tirumal Rao: 2022-23 ఏడాదిలో ఏపీఎస్ ఆర్టీసీ ప్రగతి పథంలో ముందుకు వెళ్తుందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ఏప్రిల్-ఆగస్టు వరకు బస్సుల్లో 76 శాతం ఒఆర్ సాధించినట్టు తెలిపారు. గత సెప్టెంబర్‌లో కార్గోలో డోర్ డెలివరీ విధానం అమలు ప్రారంభించామని... దీని ద్వారా సగటున రోజుకు 5802 పార్సిళ్లు బుక్ అవుతున్నాయన్నారు. గతంలో 972 ఉండగా... ఇది ఇప్పుడు 5 వందల శాతం పెరిగిందని చెప్పారు. గత ఏడాది ఆర్టీసీ కార్గోలో 122 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఆర్టీసీలో 998 కొత్త అద్దె బస్సుల కోసం టెండర్లు ఆహ్వానించామని చెప్పారు. ప్రయాణీకులు, ఆర్టీసీ లాభం కోసమే అద్దె బస్సులు తీసుకుంటున్నామన్నారు.

Tags:    

Similar News