Roja: చంద్రబాబు ఓ రాక్షసుడు.. నీచుడు
Roja: భీమిలి సభలో మతి తప్పి మాట్లాడాడు
Roja: చంద్రబాబు ఓ రాక్షసుడు.. నీచుడు
Roja: టీడీపీ అధినేత చంద్రబాబు ఓ రాక్షసుడని, నీచుడని, భీమిలి సభలో మతి తప్పి మాట్లాడాడని ఏపీ మంత్రి రోజా ఆరోపించారు. తాను చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోలేడని ఎద్దేవా చేశారామె... తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడారు. మరో పక్క ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నాలుగో కృష్ణుడు లాంటిదని, రాష్ట్రాన్ని విభజించి, వైఎస్సార్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన పార్టీలో చేరిందని దుయ్యబట్టారు.
పక్క రాష్ట్రాల్లో కాపురాలు చేసుకునే వారు.. సంక్రాంతి అల్లుళ్ల లాగా ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారని అన్నారు. టీడీపీ అధినేత దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ ఎప్పుడేం మట్లాడుతారో ఆయనకే అర్థం కాదని, ప్యాకేజీ ఇచ్చినప్పడు మాత్రమే మాట్లాడి.. తర్వాత తన మాటలు కొనసాగించలేడన్నారు.