ఎన్ఏడీ ప్లేవర్ కింద రోడ్డు ప్రమాదం.. కంటైనర్ డీ కొని ఒకరు మృతి మహిళకు తీవ్ర గాయాలు

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు విధించిన లాక్ డౌన్ పుణ్యమాని కాస్త ప్రమాదాలు తగ్గాయి.

Update: 2020-06-15 03:33 GMT
Road Accident in Visakhapatnam

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు విధించిన లాక్ డౌన్ పుణ్యమాని కాస్త ప్రమాదాలు తగ్గాయి. లాక్ డౌన్ ఎత్తివేయడంతో మరలా యధాతధంగా జరుగుతున్నాయి. తాజాగా విశాఖ సిటీ ఎన్ఏడీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఘోరాన్ని తలపించింది. ఎన్ఏడీ ప్లేవర్ కింద రోడ్డు ప్రమాదం కింద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మహిళకు తీవ్ర గాయలయ్యాయి. ప్రమాదానికి సంబందించి కంచరపాలెం ట్రాఫిక్ పోలీసు లు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి .

కంచరపాలెం రాంజీ ఎస్టెట్ ప్రాంతానికి చెందిన ఎం . జనతం ( 56 ) అతడి బార్య రోత్ ( 50 ) ఆదివారం ఉదయం తుని వద్ద నున్న బంధువుల ఇంటికి వెళ్ళి సాయంత్రం తిరిగి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తున్నారు . ఎన్ ఏడీ కూడలి సిగ్నల్ పాయింట్ దాటి ఎన్ .ఏడీ ప్లేవర్ కింద నుండి ఎన్ .ఎస్టీఎల్ వైపుగా వెళ్తున్న సమయంలో బెంగళూరు నుండి కోల్ కత్త వెళ్తున్న ఆన్ లైన్ కొరియర్ కంటైనర్ ద్విచక్ర వాహనాన్ని డీ కోనడంతో ద్విచక్ర నడుపుతున్న జనతం కుడి వైపు కు పడిపొవడంతో ఆతడి తలపై కంటైనర్ దూసుకుపోయింది. దింతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.

అతడి బార్య ఎడమ కాళ్లకి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను చికిత్స నిమిత్తం కెజిహెచ్ తరిలించారు . విశయం తెలుసుకున్న ట్రాఫీక్ ఏ .డి.సి సి.హెచ్ ఆదినారాయణ పరిస్థితిని సమీక్షించారు. కాగ ప్రమాదానికి కారణమైన కంటైనర్ డ్రైవర్ గూడా చాంద్ (45 ) ,క్లినర్ మున్నా (35 )ను ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసు లు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరిలించారు. మృత దేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కెజిహెచ్ కు తరలించి కేసు దర్యాప్తు చేస్తునట్లు ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసు లు తెలిపారు.


Tags:    

Similar News