Vijaysai Reddy: జగన్ తో మాట్లాడిన తర్వాతే రాజీనామా..!

Vijaysai Reddy: జగన్ తో మాట్లాడిన తర్వాతే తాను ఎంపీ పదవికి రాజీనామా చేసినట్టు విజయసాయిరెడ్డి చెప్పారు.

Update: 2025-01-25 06:39 GMT

Vijaysai Reddy: జగన్ తో మాట్లాడిన తర్వాతే రాజీనామా..!

Vijaysai Reddy: జగన్ తో మాట్లాడిన తర్వాతే తాను ఎంపీ పదవికి రాజీనామా చేసినట్టు విజయసాయిరెడ్డి చెప్పారు. శనివారం ఉదయం రాజ్యసభ చైర్మన్ కు రాజీనామా అందించిన తర్వాత ఆయన న్యూదిల్లీలో మీడియాతో మాట్లాడారు. తనను రాజీనామా చేయవద్దని కూడా జగన్ కోరారన్నారు.తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని జగన్ సూచించారన్నారు. పార్టీకి పూర్తిగా అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. 

వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేశానని ఆయన చెప్పారు. తన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారన్నారు. కేసుల మాఫీ కోసం తాను రాజీనామా చేశానని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పినందున తాను భవిష్యత్తులో రాజకీయాల గురించి మాట్లాడనని ఆయన అన్నారు.

తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.తనలాంటి వాళ్లు వెయ్యి మంది వైఎస్ఆర్‌సీపీ నుంచి బయటు వెళ్లినా జగన్ కు ఉన్న ప్రజాదరణ తగ్గదని ఆయన అన్నారు. వెన్నుపోటు రాజకీయాలు తనకు తెలియవన్నారు.తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా, అప్రూవర్ గా మారలేదని ఆయన అన్నారు. తనపై కేసులు మాఫీ చేయించుకునేందుకు రాజీనామా చేయలేదని ఆయన అన్నారు.

ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తనపై అక్రమ కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. 2011 ఆగస్టులో తనపై కేసులు పెట్టారని విజయసాయి రెడ్డి చెప్పారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. విక్రాంత్ రెడ్డిని కేవీరావు వద్దకు తాను పంపానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన అన్నారు.

చెన్నైలో ఉన్నప్పటి నుంచి తనకు పవన్ కళ్యాణ్ తో పరిచయం ఉందన్నారు. చంద్రబాబుతో రాజకీయంగా విబేధించినట్టు ఆయన తెలిపారు. కానీ, ఈ ఇద్దరితో వ్యక్తిగతంగా తనకు శత్రుత్వం లేదన్నారు. పార్టీలో తన ప్రాధాన్యతను ఎవరూ తగ్గించలేదని ఆయన అన్నారు.

Tags:    

Similar News