AP Government: కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఏపీలో 12 ప్రాజెక్టుల పేర్లను మారుస్తూ జీవో

AP Government: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 10 Aug 2024 12:49 PM IST
AP Government Changes Names of 12 Irrigation Projects
X

AP Government: కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఏపీలో 12 ప్రాజెక్టుల పేర్లను మారుస్తూ జీవో

AP Government: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలు సంక్షేమ పథకాల పేర్లు మార్చిన ప్రభుత్వం తాజాగా వైసీపీ ప్రభుత్వ హయాంలో మార్పులు చేసిన.. పలు ప్రాజెక్టుల పేర్లను పునరుద్ధిరిస్తూ నిర్ణయం తీసుకుంది. 12 సాగునీటి ప్రాజెక్టుల పేర్లను మారుస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న పేర్లనే పునరుద్ధరిస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. YSR పల్నాడు కరవు నివారణ ప్రాజెక్టును గోదావరి పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టుగా YSR వేద్రాది ఎత్తిపోతలను ముక్త్యాల ఎత్తిపోతలుగా మార్చింది. సంగం బ్యారేజీ, తాటిపూడి రిజర్వాయర్, హంద్రీనీవా సుజల స్రవంతి పేర్లనూ పునరుద్ధరించింది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story