ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భవనంలోకి వర్షపు నీరు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భవనంలోకి వర్షపు నీరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భవనంలోకి వర్షపు నీరు

Update: 2019-09-19 03:17 GMT

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించిన హైకోర్టు తాత్కాలిక భవనంలోకి వర్షపు నీరు చేరింది. బుధవారం కురిసిన వర్షానికి హైకోర్టు భవనం గోడల్లోంచి నీరు కారింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఆ నీరును బయటికి పంపించారు. సుమారు రూ.150 కోట్లతో షేర్వాల్‌ టెక్నాలజీతో నిర్మించిన ఈ భవనం గోడల్లోనుంచి నీరు కారడంపై ప్రభుత్వం ఆరాతీసింది. భవనాలు డ్యామేజీ కాకుండా చూడాలని ఆదేశించింది.

ఇదిలావుంటే 2017లో కూడా వర్షాల కారణంగా అసెంబ్లీలో నాటి ప్రతిపక్షనేత అయిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చాంబర్‌ లోకి కూడా నీరుచేరింది. అలాగే గతేడాది కురిసిన వర్షాలకు సచివాలయంలో మాజీ మంత్రులు అమర్‌నాథ్‌రెడ్డి, దేవినేని ఉమ చాంబర్లలోకి భారీగా వర్షపు నీరు చేరిన సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News