ఏపిలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..

Update: 2019-09-15 03:54 GMT

ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తులో ఆవరించి ఉండటంతో.. రానున్న మూడు రోజులూ కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈనెల 16, 17, 18 తేదీల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలతోపాటు యానాంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. కాగా గడచిన 24 గంటల్లో బాపట్లలో 8 సెంటీమీటర్లు, అవనిగడ్డలో 6, గూడూరు, గుంటూరులో 5, తిరువూరు, విజయవాడ, గుంటూరులో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం పేర్కొంది. 

Tags:    

Similar News