48 గంటల్లో అల్పపీడనం.. ఏపీలో మళ్ళీ వర్షాలు

48 గంటల్లో అల్పపీడనం.. ఏపీలో మళ్ళీ వర్షాలు 48 గంటల్లో అల్పపీడనం.. ఏపీలో మళ్ళీ వర్షాలు

Update: 2019-09-28 02:38 GMT

ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఉత్తర కోస్తాలో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. శనివారం మాత్రం ఉత్తరాంధ్రలో ఆకాశం నిర్మలంగా ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ఈ ప్రభావంతో అనేక ప్రాంతాల్లో వర్షాలకు అనుకూలమైన వాతావరణం కొనసాగుతోంది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తూర్పు, మధ్య భారతంలో వర్షాలు కురుస్తాయి.

Tags:    

Similar News