PV Sindu: పవన్ కల్యాణ్ ను కలిసి తన వివాహానికి ఆహ్వానించిన పీవీ సింధు

PV Sindu: భారత షట్లర్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఈరోజు సాయంత్రం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసారు.

Update: 2024-12-15 14:44 GMT

PV Sindu: పవన్ కల్యాణ్ ను కలిసి తన వివాహానికి ఆహ్వానించిన పీవీ సింధు

PV Sindu: భారత షట్లర్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఈరోజు సాయంత్రం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసారు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ ను కలిశారు. సింధు, పవన్ కల్యాణ్ కు పెళ్లి పత్రిక అందించి తన పెళ్లికి రావాలని ఆహ్వానించింది. ఈ సందర్భంగా సింధుకు పవన్ శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్, సింధు, ఆమె తండ్రి వెంకటరమణతో కాసేపు మాట్లాడారు.

వ్యాపారవేత్త వెంకట దత్తసాయితో పీవీ సింధు వివాహం డిసెంబర్ 22న రాజస్థాన్ లో జరగనుంది. కొన్ని రోజుల క్రిందటే సింధు, వెంకట దత్తసాయి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ నేపథ్యంలోనే తన పెళ్లికి రావాలని సింధు ప్రముఖులను స్వయంగా కలుస్తూ ఆహ్వానిస్తోంది. 

Tags:    

Similar News