S.Rayavaram: పిల్లల్ని స్కూళ్ళకు పంపవద్దని ఎంఈఓ విజ్ఞప్తి

రోనా వైరస్ విస్తృతి అవుతున్న కారణంగా తల్లిదండ్రులు తమ పిల్లల్ని పాఠశాలలకు పంపించవద్దని ఎంఈఓ ఏఎన్ఎస్ఏఎన్ మూర్తి విజ్ఞప్తి చేశారు.

Update: 2020-03-20 14:52 GMT

ఎస్.రాయవరం: కరోనా వైరస్ విస్తృతి అవుతున్న కారణంగా తల్లిదండ్రులు తమ పిల్లల్ని పాఠశాలలకు పంపించవద్దని ఎంఈఓ ఏఎన్ఎస్ఏఎన్ మూర్తి విజ్ఞప్తి చేశారు. కొన్ని ప్రయివేట్ పాఠశాలలు ప్రత్యేక తరగతులు పేరిట, కొంత మంది విద్యార్ధులకు క్లాసులు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయని తెలిపారు. అయితే తమ పరిశీలనా సమయంలో ఎటువంటి క్లాసుల నిర్వాహణ కనపడలేదన్నారు. ఇందులో భాగంగా అడ్డురోడ్ లోని ప్రయివేట్ పాఠశాలలను ఆయన శుక్రవారం పరిశీలించారు.

ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం వారు పిల్లల్ని స్కూల్ కి పంపించమని చెప్పినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల్ని పంపించవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం చాపకింద నీరులా కరోనా వ్యాధి వ్యాపిస్తున్నదని అన్నారు. ఇది అంటువ్యాధి కాబట్టి , అట్టి వ్యాధి రాకుండా చూసుకోవడం మనందరి బాద్యతగా భావించి పిల్లల్ని పాఠశాలకు పంపించరాదని అన్నారు.

ఏ ప్రైవేటు పాఠశాల అయినా మీ పై ఒత్తిడి తెస్తే అధికారులకి ఫిర్యాదు చేయాలని సూచించారు. అదే విధంగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, పాఠశాలలో కానీ వేరే ఇతర ప్రదేశాల్లో కానీ ప్రత్యేక తరగతులు పేరిట క్రాసులు నిర్వహిస్తే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఆఫీస్ వర్క్ పేరిట స్టాఫ్ ని కూడా పాఠశాలలో ఉంచరాదని తెలిపారు.


Tags:    

Similar News