Visakhapatnam: రైల్వే స్టేషన్లలో కరోనా జాగ్రత్త చర్యలు

Update: 2020-03-20 16:12 GMT

విశాఖపట్నం: కరోనా (కోవిడ్‌ 19) నివారణ చర్యలలో భాగంగా వాల్తేర్‌ డివిజన్‌లో డిఆర్‌ఎం, ఎడిఆర్‌ఎం, వైద్యాధికారుల పర్యవేక్షణలో స్టేషన్లు, కార్యాలయాలు, కాలనీలలో అవగాహన కల్పిస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు రైల్వేశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. డివిజనల్‌ కార్యాలయాలలో, కోచ్‌ డిపోలలో థర్మల్‌ స్కానర్లు ఏర్పాటు చేశారు.

ఒక్కరోజే సుమారు 4800 మందికి పైగా స్క్రీనింగ్‌ నిర్వహించారు. స్టేషన్లలో కోచ్‌లు, కోచ్‌లలోపల, డోర్‌ హ్యేండిల్స్‌, టాయిలెట్‌ డోర్‌ హ్యాండిల్స్‌, టాయిలెట్‌లో నీళ్ళు వచ్చే గొట్టాలు తదితరాలను తరచుగా శుభ్రం చేస్తున్నట్లు పేర్కొన్నారు.


Tags:    

Similar News