Varahi Yatra: పవన్ వారాహి యాత్రకు పోలీసుల ఆంక్షలు..
Varahi Yatra: అనుమతి ఉన్న చోట తప్ప ఎక్కడా రోడ్ షో నిర్వహించకూడదని కండిషన్
Varahi Yatra: పవన్ వారాహి యాత్రకు పోలీసుల ఆంక్షలు..
Varahi Yatra: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు పోలీసులు ఆంక్షలు విధించారు. ఎయిర్‌పోర్టు నుంచి వచ్చే సమయంలో పవన్ బయటకు వచ్చి అభివాదాలు చేయొద్దన్నారు పోలీసులు. అనుమతి ఉన్న చోట తప్ప ఎక్కడా రోడ్ షో నిర్వహించకూడదని కండిషన్ పెట్టారు. మొదట నిర్ణయించిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో రావాలని సూచించారు. విమానాశ్రయం నుంచి పోర్డు రోడ్డులో పవన్ వచ్చేలా రూట్‌మ్యాప్ ఇచ్చారు పోలీసులు. సాయంత్రం 5 గంటలకు జగదాంబ సెంటర్‌లో వారాహి యాత్రకు అనుమతి ఇచ్చారు. ఇక పోలీసుల ఆంక్షలతో విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా హోటల్‌కు వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్.