ఇల్లు వదిలి బయటకు వచ్చారో అంతే... ఏపీ పోలీసుల స్పెషల్ ట్రీట్మెంట్!

కరోనా మహమ్మారి ప్రపంచలోని ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది! దీనిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలను కట్టుదిట్టం చేశాయి.

Update: 2020-03-24 11:50 GMT
Police punishment

కరోనా మహమ్మారి ప్రపంచలోని ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది! దీనిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలను కట్టుదిట్టం చేశాయి. ఇక రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ ప్రకటించాయి. గుంపులుగుంపులుగా బయటకు రావొద్దని, కుటుంబ నుంచి ఒక్కరే బయటకు రావాలని హెచ్చరిస్తున్నారు. ఇక నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.

అవసరం ఉంటే తప్ప బయటకు రాకుడదని వెల్లడించారు. ఇక వీటిని పోలీసులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇక ప్రజలు కూడా నిత్యావసర వస్తువుల కోసం బయటకు వస్తున్నారు. జనాలు ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తం అయి వారిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

జనతా కర్ఫ్యూనీ విజయవంతం చేయడంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారు.. ప్రజలు ఏవేమి పట్టన్నట్టు రోడ్ల పైకి వచ్చి తిరుగుతున్నారు. ప్రభుత్వం ఎన్ని సూచనలు సలహాలు ఇచిన సరే కొంతమంది ఇవేమీ పట్టిచుకోకుండా రోడ్లపై తిరుగుతున్నారు. అయితే చిత్తూర్ పోలీసులు మాత్రం దీనికి బిన్నం. ఇలా కారణం లేకుండా లాక్ డౌన్ సమయంలో బయటకు వస్తున్న యువకులకు పోలీసులు కొత్త పద్దతిని మొదలు పెట్టారు.

చిత్తూర్ జిల్లా లో పోలీసులు సరికొత్త పనిష్మెంట్ ఇస్తున్నారు. రోడ్లపై కి వస్తున్న వాహనదారులతో గుంజిళ్ళు తీయిస్తున్నారు. ఎవరైతే ఇలా సరైన కారణం లేకుండా రోడ్లపైకి వస్తే ఇదే పనిష్మెంట్ ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే కొన్ని ప్రదేశాలలో ఎంత చెప్పినా వాహనదారులు వినకపోవడంతో పోలీసులు లాఠీలకు పని చెబుతున్నారు. అయినప్పటికీ మాట వినక పొతే పోలీసులు వారి పై లాఠీలు ఝుళిపిస్తున్నారు.

Tags:    

Similar News