కోడెల ఆత్మహత్య కేసులో కీలకం అదే..

Update: 2019-09-22 07:22 GMT

 మాజీ స్పీకర్‌, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద రావు ఆత్మహత్యపై తెలంగాణ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సూసైడ్‌ నోట్‌ కూడా లభించకపోవడంతో పోలీసులు సాంకేతిక పరికరాలను అనుసరిస్తున్నారు. కోడెల ఆత్మహత్యకు ముందు గంట వ్యవధిలో 10–12 మందితో మాట్లాడినట్టు గుర్తించారు. చని పోవడానికి ముందు ఫోన్‌ చేసిన వ్యక్తికే ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను గురించి కోడెల చెప్పి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోడెలతో ఫోన్‌లో మాట్లాడిన వారిని రహస్యంగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో ముఖ్యంగా కోడెల ఫోన్‌కాల్‌ డేటాపైనే దృష్టి సారించారు. అయితే ఆయన సెల్ ఫోన్ అదృశ్యమవడంతో ప్రస్తుతం ఫోన్ ను గుర్తించే పనిలో పడ్డారు. మరోవైపు కోడెల శివప్రసాదరావు మేనల్లుడు కంచేటి సాయిబాబు కూడా గుంటూరు జిల్లా సత్తెనపల్లి పోలీసులకు చేసిన ఫిర్యాదుపై కూడా బంజారాహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. 

Tags:    

Similar News