Mandapeta: ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని టౌన్ సీఐ అడపా నాగమురళి పేర్కొన్నారు. పట్టణంలోని కలవపూవ్వు సెంటర్ లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ లో భాగంగా టౌన్ ఎస్ ఐ బి రాజేష్ కుమార్ నేతృత్వంలో వాహనదారులకు అవగాహన కల్పించారు.

Update: 2020-02-28 07:54 GMT
టౌన్ సిఐ అడపా నాగమురళి, ఎస్ ఐ రాజేష్ కుమార్ మరియు ఇతర సిబ్బంది

మండపేట: పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని టౌన్ సీఐ అడపా నాగమురళి పేర్కొన్నారు. పట్టణంలోని కలవపూవ్వు సెంటర్ లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ లో భాగంగా టౌన్ ఎస్ ఐ బి రాజేష్ కుమార్ నేతృత్వంలో వాహనదారులకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ రద్దీ గా ఉండే సమయాల్లో ప్రజలు సంయమనం పాటించి నిబంధనలకు అనుగుణంగా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ముఖ్యంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ మోటార్ సైకిళ్ళు నడపడం ఎంతో ప్రమాదమని సూచించారు. పట్టణంలో ఎక్కువగా త్రిబుల్ రైడింగ్ చేస్తున్నారని ఇది చట్టవిరుద్ధం అన్నారు. ఖచ్చితంగా లైసెన్స్ తో పాటు వాహనానికి సంబంధించిన అన్ని రికార్డులు వాహన దారుల వద్ద ఉండాలని సూచించారు. అలాగే మైనర్ విద్యార్థులకు తల్లిదండ్రులకు వాహనాలు ఇవ్వకూడదన్నారు. తద్వారా జరిగే పరిణామాలను వివరించారు.

కెపి రోడ్డు, మెయిన్ రోడ్లలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేశారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతు న్నారని అలాంటి వారు పట్టుబడితే జరిమానాలు తప్పవన్నారు. వాహనాలు వేగంగా వెళ్లడం వల్ల వారి ప్రాణాలతో పాటు ఇతర వాహనదారులకు కూడా నష్టం కలిగించే రీతిలో ప్రవర్తించడం ఎటువంటి పరిస్థితుల్లోనూ తగదని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలపై పాఠశాలల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News