Annavaram: రత్నగిరి ఇకపై ప్లాస్టిక్ రహితం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేముని సన్నిధిలో ప్లాస్టిక్ కవర్లు వినియోగించకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని దేవస్థానం అధికారులు తెలిపారు.

Update: 2020-02-15 11:34 GMT

అన్నవరం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేముని సన్నిధిలో ప్లాస్టిక్ కవర్లు వినియోగించకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని దేవస్థానం అధికారులు తెలిపారు. ప్లాస్టిక్ వాడకం వలన పర్యావరణ విపత్తులు ఏర్పడుతాయని తెలిసి కూడా వాటిని దేవస్థానంలో వివిధ ప్రదేశాలలో విరివిగా వాడుతున్నారని, అన్నవరం దేవస్థానం ప్లాస్టిక్ రహిత జోన్ గా ఏర్పాటు చేయాలని క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించారు.

అందుకు అనుగుణంగా దేవస్థానం సీ సెక్షన్ అధికారులు దేవస్థానం పరిధిలో గల షాపులు, హోటల్లు, కొబ్బరికాయ దుకాణం వారికి అల్టిమేటం జారీ చేశారు. ఇకపై ప్లాస్టిక్ కవర్లు వినియోగించే వారికి రూ.10,000లు జరిమానా విధిస్తామని, పరిధి దాటి వినియోగిస్తే లీజు లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని ప్రకటనలో తెలిపారు.


Tags:    

Similar News