ప్రొద్దుటూరు ప్రజల దాహార్తి సమస్యకు శాశ్వత పరిష్కారం: రాచమల్లు

ప్రొద్దుటూరు ప్రజల దాహార్తిని శాశ్వతంగా తీర్చేందుకు అమృత్ పథకం కింద చేపట్టిన మంచినీటి పథకానికి సంబంధించి రామేశ్వరంలోని పెన్నానది

Update: 2020-02-29 08:48 GMT

ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు ప్రజల దాహార్తిని శాశ్వతంగా తీర్చేందుకు అమృత్ పథకం కింద చేపట్టిన మంచినీటి పథకానికి సంబంధించి రామేశ్వరంలోని పెన్నానది ఒడ్డున ఉన్న రామేశ్వరం వాటర్ హెడ్ వర్క్స్ సమీపంలో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణానికి శనివారం ఉదయం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ పథకం పూర్తి చేసి సురక్షితమైన మంచి నీటిని అందించడమే కాక ప్రతిరోజు మంచి నీటిని సరఫరా చేసేందుకు వీలవుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలియజేశారు. ఎన్నికల అప్పుడు ప్రజలకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు మంచినీటి సమస్య పరిష్కారంలో ఈ శంకుస్థాపన అత్యంత కీలకమైనదని, దీనిని పూర్తి చేయడం తన బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 2016 లోనే ఈ ప్రాజెక్టుకు బీజం పడిందని గత ప్రభుత్వం నిర్లక్ష్యం, చిత్తశుద్ధి లేని కారణంగా ఇంతకాలం పనులు నత్తనడకన సాగాయి అన్నారు.

151 కోట్ల వ్యయం అయ్యే అమృత్ పథకం కేంద్రం ఇచ్చిన వాటాన్ని అప్పటి ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు వినియోగించుకున్న దని, కాంట్రాక్టర్కు చెల్లించాల్సిన బిల్లులు ఆలస్యం కావడంతో పనులు ఆగిపోయాయి అన్నారు. ఈ శంకుస్థాపన లో మున్సిపల్ కమిషనర్ రాధారెడ్డి, కాంట్రాక్టర్ మెగా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ అధికారులు, మున్సిపల్ అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.


Tags:    

Similar News