Peddireddy: పొత్తుపై బీజేపీ సరిగా స్పందించలేదేమో... అందుకే టీడీపీతో ఉంటానని పవన్ తేల్చి చెప్పారు
Peddireddy: పవన్ కామెంట్స్‌పై స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
Peddireddy: పొత్తుపై బీజేపీ సరిగా స్పందించలేదేమో... అందుకే టీడీపీతో ఉంటానని పవన్ తేల్చి చెప్పారు
Peddireddy: వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి ముందుకు వెళ్తానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా పవన్‌పై సెటైర్లు విసిరారు. నిన్నటి వరకు పవన్ బీజేపీతో ఉన్నారని...పొత్తుపై బిజేపి సరిగా స్పందించలేదేమో, అందుకే అయన టీడీపీతో ఉంటానని తేల్చి చెప్పారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్ని జెండాలు కలిసినా తమది మాత్రం ఒక జెండానే అని స్పష్టం చేశారు. గతంలో కూడా అన్ని జెండాలకు ఎదురెళ్లి గెలిచామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుర్తుచేశారు.