Peddireddy: కాంగ్రెస్‌లోకి షర్మిల.. మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Peddireddy: జగన్‌కు వ్యతిరేకంగా పనిచేసేవారు ప్రతిపక్షమే

Update: 2024-01-04 13:07 GMT

Peddireddy: కాంగ్రెస్‌లోకి షర్మిల.. మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Peddireddy: వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉన్నా.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా.. తాము ప్రతిపక్షంగానే చూస్తామన్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రాన రాజకీయాల్లో తమ కాళ్లు తామే నరుక్కుంటామా? అని ప్రశ్నించారు. కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేసే నైజం సోనియాగాంధీది, చంద్రబాబుది అన్నారు. అందుకే ఆనాడు ఇద్దరూ కలిసి జగన్‌ను జైలుకు పంపించారన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉన్నా రాజకీయ ప్రత్యర్ధిగానే చూస్తామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

Tags:    

Similar News