నాగబాబు అభిప్రాయాలతో జనసేనకు సంబంధం లేదు : పవన్ కళ్యణ్

సినీనటుడు, జనసేన పార్టీ నాయకుడు నాగబాబు ఇటీవల జాతిపిత గాంధీజి విషయంలో వివాదాస్పద ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే.

Update: 2020-05-23 10:03 GMT
Nagababu, pawan kalyan(File photo)

సినీనటుడు, జనసేన పార్టీ నాయకుడు నాగబాబు ఇటీవల జాతిపిత గాంధీజి విషయంలో వివాదాస్పద ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ సహా కమ్యూనిస్టులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.. అయితే నాగబాబు ట్వీట్ పై రగడ కొనసాగుతోన్న తరుణంలో జనసేన అధినేత, నాగబాబు సోదరుడు పవన్ కళ్యాణ్ స్పందించారు.. ఈ మేరకు ఓ లెటర్ రూపంలో నాగబాబు అభిప్రాయంపై మాట్లాడారు.. వ్యక్తిగత అభిప్రాయాలతో జనసేనకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీలో లక్షలాదిగా ఉన్న నాయకులు, జన సైనికులు, అభిమానులు సామాజీక మాధ్యమాలలో వ్యక్తం చేసే అభిప్రాయాలు వారి వ్యక్తిగత అభిప్రాయాలు గానే పరిగణించాలని.. పార్టీకి ఇందులో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

గతంలో కూడా ఇదే విషయాన్ని చెప్పినట్టు గుర్తుచేశారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు సోషల్‌ మీడియాలో వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమైనవి. ఆయన అభిప్రాయాలతో జనసేన పార్టీకి ఎటువంటి సంబంధమూ లేదని పేర్కొన్నారు. అలాగే పార్టీకి సంబంధించిన అభిప్రాయాలను, నిర్ణయాలను పార్టీ అధికార పత్రం ద్వారా ఎప్పటికప్పుడు తెలియచేస్తూనే ఉన్నామని.. వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు. ప్రస్తుతం కరోనా కష్టకాలంలో ప్రజాసేవ తప్ప మరేతర అంశాల జోలికి వెళ్లవద్దని ఆయన జనసైనికులకు సూచించారు.  

Tags:    

Similar News