కేంద్ర వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా పవన్ వ్యాఖ్యలు

Update: 2020-12-03 11:53 GMT

జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్‌ కేంద్ర వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. రైతుల మేలు కోసమే కేంద్రం కొత్త చట్టాలను తెచ్చిందన్నారు. రైతులతో కేంద్రం చర్చలు జరుపుతోందన్న పవన్‌ కల్యాణ్.. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాల్లో లోపాలుంటే చర్చించి పరిష్కరించుకోవాలన్నారు.

రైతులకు గిట్టుబాటు ధర కాదు.. లాభసాటి ధర కావాలన్నారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్. రైతులకు జనసేన అండగా ఉంటుందని రైతుల కోసం ఓ ప్రణాళికతో ముందుకొస్తామన్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకి పరిహారం ఇవ్వాలని ఎకరాకు 35వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తమ లక్ష్యమన్నారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్.

రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ స్పందించారు. రజనీకాంత్‌ ఎప్పటి నుంచో రాజకీయాలపై ఫోకస్ పెట్టారన్నారు. బలమైన ఆలోచనతో వస్తున్న నేతలను స్వాగతించాల్సిదేనన్నారు. రజనీకాంత్‌ లాంటి వారు.. రాజకీయాలకు అవసరమని అలాంటి వ్యక్తులు విజయవంతం కావాలని కోరుకుంటున్నాన్నారు పవన్‌కల్యాణ్.

Tags:    

Similar News