Pawan Kalyan: విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి
Pawan Kalyan: విశాఖ ఉక్కుపై కేంద్రమంత్రి ప్రకటన ఆశాజనకంగా ఉంది
Pawan Kalyan: విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి
Pawan Kalyan: విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖ ఉక్కుపై కేంద్రమంత్రి ప్రకటన ఆశాజనకంగా ఉందని అభిప్రాయపడ్డారు.రాష్ట్ర ప్రభుత్వానికి విశాఖ ఉక్కును కాపాడాలనే చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. విశాఖ ఉక్కు తెలుగువారి భావోద్వేగాలతో ముడిపడి ఉందని అన్నారు.
కేంద్రమంత్రి అమిత్ షాను కలిసినప్పుడు విశాఖతో తెలుగువారి భావోద్వేగాలను తెలిపానని పేర్కొన్నారు. ప్రైవేటీకరణ వద్దన్నప్పుడు బీజేపీ నేతలు సానుకూలంగా స్పందించారన్నారు. కొద్ది రోజులుగా విశాఖ ఉక్కుపై పొరుగు రాష్ట్రం స్పందిస్తొందన్నారు.