MP Kesineni Shivanath: విజయవాడలో మరిన్ని జాతీయ పోటీలకు కృషి
MP Kesineni Shivanath: విజయవాడలో జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం అయ్యాయి.
MP Kesineni Shivanath: విజయవాడలో జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు చెన్నుపాటి రామకోటయ్య స్టేడియంలో జరగనున్న ఈ పోటీలను ఎంపీ కేశినేని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రామ్మోహన్, శాప్ చైర్మన్ రవి నాయుడు, స్వచ్ఛంద్రా కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్ పి.వి.సింధు పాల్గొని క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలో జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లు జరగడం గర్వకారణమని... క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందనీ ముఖ్య అతిథులు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ పోటీలను విజయవాడకు తీసుకురావడానికి కృషి చేస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.